సాహో సీన్ రివర్స్.. బిత్తరపోతున్న బాలీవుడ్..Saaho
2019-09-03 17:00:21

మన ఇండస్ట్రీకి వచ్చి వేరే హీరో అజమాయిషీ చేస్తుంటే ఎవరికైనా కడుపు మండిపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇదే జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి హిందీలో రికార్డులు సృష్టిస్తున్నాడు ప్రభాస్. బాహుబలి ఇప్పటికే అక్కడ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు సాహో సినిమా కూడా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతుంది. తొలిరోజు ఈ సినిమాను చూసి విమర్శించారు విశ్లేషకులు. అసలు ఇది సినిమానే కాదు.. 350 కోట్లు అనవసరంగా నాశనం చేశారు అంటూ ఇష్టం వచ్చినట్లు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. తరుణ్ ఆదర్శ్ తో పాటు మరి కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ కూడా సాహో సినిమాతో ఆడుకున్నారు. అది ఎలా ఉంది అనేది పక్కన పెడితే కనీసం సినిమా చూడటం కూడా వేస్ట్ అంటూ చాలా పదాలు వాడారు. దాంతో ప్రభాస్ అభిమానులు కూడా బాగానే ఫైర్ అయ్యారు. ఒక సినిమా ఎలా ఉందో రాయాలి కానీ ఇలా వ్యక్తిగతంగా విమర్శించకూడదు సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. ఒక దక్షిణాది హీరో వస్తే అక్కడి వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.. తన అక్కసు వెల్లగక్కుతున్నారు అంటూ చాలానే విమర్శలు వచ్చాయి. అలాంటి సమయంలో సాహో సినిమా టాక్ తో పనిలేకుండా సంచలన వసూళ్లు సాధించడం ఇప్పుడు బాలీవుడ్ విశ్లేషకులకు కూడా మింగుడు పడటం లేదు. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 95 కోట్లు వసూలు చేసింది. అసలు తొలిరోజు వచ్చిన టాక్ సాహో సినిమా డిజాస్టర్ గా మారుతుంది అనుకున్నారు కానీ ఎవరికీ అర్థం కాని రీతిలో సాహో సంచలన వసూళ్ళు సాధిస్తుండడంతో ఏం మాట్లాడలేకపోతున్నాను ట్రేడ్ పండితులు. ముఖ్యంగా విమర్శించిన నోటితోనే ప్రభాస్ సూపర్ స్టార్ అంటూ పొగిడాడు తరణ్ ఆదర్శ్. ఒకవేళ నిజంగానే సాహో పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఉండుంటే బాలీవుడ్ లో సూపర్ స్టార్స్ కు కూడా ప్రభాస్ కచ్చితంగా చెమటలు పట్టించి ఉండేవాడు. సరిగ్గా ప్లాన్ చేసుకొని డైరెక్ట్ హిందీ సినిమా చేస్తే అక్కడ సూపర్ స్టార్స్ కుర్చీలు ప్రభాస్ దెబ్బకు కదలడం ఖాయం. మరి చూడాలి ఫ్యూచర్ ఎలా మారనుందో..!

More Related Stories