సాహో రివ్యూSaaho Review
2019-08-30 14:29:59

సాహో.. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ఇండస్ట్రీ కూడా బాగానే వేచి చూసింది. మరి ఈ చిత్రం వాళ్ల అంచనాలు అందుకుందా లేదా అనేది చూద్దాం.. 

కథ:

వాజీ సిటీలో ఎంతో మంది గ్యాంగ్ స్టర్స్ కలిసి కట్టుగా ఉంటారు. వాళ్లకు రాయ్ (జాకీ ష్రాఫ్) లీడర్. ఆయన్ని కుర్చీ నుంచి దించాలనే కుట్రలు కూడా జరుగుతుంటాయి. అదే సమయంలో 2 వేల కోట్లతో వస్తున్నపుడు ఆయన్ని శత్రువులు చంపేస్తారు. ముంబైలో జరిగిన ఆ 2 వేల కోట్ల చోరీ గురించి పోలీసులు చేధించడం మొదలు పెడతారు. ఆ కేస్ చేధించడానికి వచ్చే ఆఫీసర్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్). ఆయన టీంలోనే ఉన్న మరో ఆఫీసర్ అమృత నాయర్ (శ్రద్ధా కపూర్)తో ప్రేమలో పడతాడు అశోక్. ఓ వైపు వాళ్ల ప్రేమ.. మరోవైపు కేస్ రెండూ ముందుకు వెళ్తుంటాయి. అదే సమయంలో దొంగతనం గురించి.. అశోక్ చక్రవర్తి గురించి అదిరిపోయే నిజం ఒకటి తెలుస్తుంది. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది.. అసలు అశోక్ చక్రవర్తి ఎవరు.. సాహో ఎక్కడ్నుంచి వస్తాడు అనేది అసలు కథ.. 

కథనం:

సాహోపై ఉన్న అంచనాలకు ఈ చిత్రం గురించి ఆకాశంలో అంచనాలు పెట్టుకుని వెళ్లినా కూడా తక్కువే. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా అంటే ఆ స్థాయి అంచనాలు ఉంటాయి. బాహుబలిని దృష్టిలో పెట్టుకుని వెళ్లిన వాళ్లకు నిరాశ మాత్రం తప్పదు. యాక్షన్ సీక్వెన్సుల విషయంలో దర్శకుడికి ఉన్న ఇష్టం.. మోజు కనిపిస్తుంది. మనకు స్క్రీన్ పై కూడా అది కనిపిస్తుంది. కానీ కథ విషయంలో మాత్రం అది కనిపించలేదు. కథనం అసలు లేకపోవడంతో చాలా చోట్ల సాహో మన సహనానికి పరీక్ష పెడుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే మరీ దారుణంగా ఉంటాయి. మొదటి నుంచే మాఫియా గ్యాంగ్ మొదలవుతుంది. రెండు గ్యాంగ్స్ మధ్య వచ్చే వార్ సాహో. అక్కడ్నుంచి ఆదిపత్యం కోసం పోరు జరుగుతుంటుంది. మధ్యలో హీరో వస్తాడు.. ఇది చాలా సినిమాల్లో చూసిన కథే.. కానీ దీన్ని కొత్తగా యాక్షన్ రూపంలో చూపించాలనుకున్నాడు సుజీత్. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు ఈ కుర్ర దర్శకుడు. ప్రభాస్ ఎంట్రీ సీన్ కూడా చాలా క్యాజువల్ గా ఉంది ఈ సీన్. ఫస్టాఫ్ కూడా అంతే క్యాజువల్ గా వెళ్లిపోయింది. ఎక్కడా చిన్న ట్విస్ట్ కూడా ఉండదు. ఇంటర్వెల్ టైమ్ కు ట్విస్ట్ ఇచ్చినా అప్పటికే ఆ ట్విస్ట్ చాలా మందికి ఐడియా వచ్చేస్తుంది. సినిమాలో రొమాన్స్‌, కామెడీ, ఎమోష‌న‌ల్‌ ఏ కోశాన కనిపించదు. శ్రద్ధా కపూర్ తో వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా వెళ్లినా కూడా సెకండాఫ్ కాస్త ఆసక్తి పెంచేస్తుంది. కథ రివీల్ అవుతుంటే ఆసక్తి పెరుగుతుంది కానీ కథనం మాత్రం మళ్లీ అంతే వీక్ అనిపిస్తుంది. ఓ సీన్ అయితే ఏకంగా హీరోయిన్ హెలికాప్టర్ నుంచి పడిపోతే హీరో గాల్లో ఎగిరి పట్టుకుంటాడు. అలాంటి సీన్స్ సాహోలో ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కూడా హాలీవుడ్ సన్నివేశాలతో పోల్చుకుంటే కాపీ అనిపిస్తుంది. ప్ర‌భాస్ చాలా తెలివిగా బాహుబలికి వ్యతిరేకంగా మోడ్రన్ యాక్షన్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఎక్కడా ఆకట్టుకోలేదు. ప్రభాస్ చేసిన కొన్ని స్టంట్స్ అయితే చూడ్డానికి ఇబ్బందిగా అనిపించాయి. క్లైమాక్స్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

నటీనటులు:

ప్రభాస్ యాక్షన్ పాత్రలో బాగానే చేసాడు కానీ బాహుబలిలో కనిపించిన ఎనర్జీ కనిపించలేదు. ముఖ్యంగా లేజీగా కదిలినట్లు అనిపిస్తుంది. శ్రద్ధా కపూర్ పర్లేదు.. లిప్ సింక్ కూడా ఇచ్చింది. స్క్రీన్ పై స్టంట్స్ కూడా బాగానే చేసింది. వెన్నెల కిషోర్ పర్లేదు.. మురళీ శర్మ ఆకట్టుకున్నాడు. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, టినూ ఆనంద్, లాల్ ఇలా చాలా మంది సినిమాలో ఉన్నారు. వాళ్లంతా ఉన్నంత వరకు బాగానే చేసారు. 

టెక్నికల్ టీం:

సాహోలో పాటలకు పెద్దగా స్కోప్ లేదు. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే అనిపించింది. పాటలు ఆకట్టుకోలేదు. విజువల్‌గా బాగున్నా కూడా ఎందుకో కానీ డబ్బింగ్ వాసనలు కొట్టేసాయి. ఎడిటింగ్ శ్రీకర ప్రసాద్ అంటే చాలా ఊహించుకుంటాం కానీ ఎందుకో ఈ చిత్రంలో మాత్రం కొన్ని సన్నివేశాలు చూస్తున్నపుడు బాగా ల్యాగ్ అనిపించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మదీ వర్క్ ఆకట్టుకుంటుంది. కథ విషయంలో సుజీత్ ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. కథనం కూడా వీక్ అనిపించింది. అనుభవం లేకపోవడం కాదు కానీ ఇంత పెద్ద సినిమాను అతడు హ్యాండిల్ చేయలేకపోయాడేమో అనిపించింది. యాక్షన్ సీన్స్ మధ్యలో సినిమా చూసినట్లు అనిపించింది కానీ కథ కోసం తీసినట్లు అనిపించలేదు. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నంతంగా ఉన్నాయి.

చివరగా:

సాహో.. యాక్షన్ ఓకే కానీ.. కథ మాత్రం చాలా వీక్..

రేటింగ్ : 2 / 5.

More Related Stories