65 కోట్లకు కంటే 5 కూడా రాలే.. ఆ సినిమా పెద్ద డిజాస్టర్..Sadak 2
2020-09-08 15:58:47

కోటి రూపాయలు ఇచ్చినా ఈ సినిమాను చూడనురా బాబు అంటున్నారు బాలీవుడ్ లో ఒక సినిమాను చూసి ఆడియన్స్. స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో.. పెద్ద హీరోయిన్.. భారీ కాస్టింగ్ ఇవన్నీ చూసి సినిమా కూడా బాగుంటుందేమో అని ఏకంగా 65 కోట్లు పెట్టి ఓటిటి రైట్స్ తీసుకున్నారు హాట్ స్టార్. కానీ ఇప్పుడు లెక్కల ప్రకారం వాళ్లకు 5 కోట్లు కూడా రాలేదని తెలుస్తోంది. అంత చండాలంగా డిజాస్టర్ అయిన సినిమా సడక్ 2. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, అలియా భట్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. హాట్ స్టార్ లో ఈ సినిమాని నేరుగా విడుదల చేశారు.

అయితే దానికి ముందు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి మహేష్ భట్ తో పాటు ఆయన కూతురు ఆలియా కూడా కారణమంటూ ఆమెపై అభిమానులు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. వాళ్ళ సినిమాలు ఏవి వచ్చినా కూడా బాయ్ కాట్ చేయాలి అంటూ సుశాంత్ అభిమానులు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే విడుదలైన సడక్ 2 టైలర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ప్రేక్షకులు అసహ్యించుకున్న ట్రైలర్ గా చెత్త రికార్డు సొంతం చేసుకుంది. సినిమాలు కూడా అలాగే తిప్పికొట్టారు ఆడియన్స్. కనీసం అందులో విషయమైనా ఉంటే సుశాంత్ అభిమానులు పక్కన పెట్టిన మిగిలిన వాళ్ళు చూసేవాళ్ళు. కానీ ఇందులో అసలు విషయం కూడా లేదు. దానికి తోడు సుశాంత్ పాపం కూడా తగిలింది అంటున్నారు అభిమానులు. అందుకే 65 కోట్లు పెట్టి కొన్న సినిమా కనీసం 5 కోట్లు కూడా తీసుకు రాకుండా అడ్డంగా ముంచేసింది. 

More Related Stories