శ్రీమతి 21 ఎఫ్ అంటున్న జయం హీరోయిన్ సదా..sadha
2019-10-18 05:25:44

వెళ్ల‌వ‌య్యా వెళ్లూ అంటూ తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది స‌దా. జ‌యం సినిమాతో ఈ భామ‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వ‌ర‌స‌గా చాలా సినిమాలు చేసింది స‌దా. ఎన్టీఆర్, బాల‌య్య లాంటి స్టార్ హీరోలు కూడా ఆఫ‌ర్లు ఇచ్చారు ఈ భామ‌కు. కానీ సుడి మాత్రం తిర‌గ‌లేదు. దాంతో స‌దా కెరీర్ ఉన్న‌ఫ‌లంగా ప‌డిపోయింది. అప‌రిచితుడు త‌ర్వాత ఈ భామ‌ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. త‌ర్వాత చేసేదేం లేక‌.. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న సినిమాలు చేస్తోన్న సదాకు ఇప్పుడు ఓ ఆఫ‌ర్ వ‌చ్చింది. అది కూడా మామూలు సినిమా కాదు. సెక్స్ వర్కర్ల జీవితం ఆధారంగా డైరెక్టర్ అబ్ధుల్ మాజిద్ తెరకెక్కించిన‌ టార్చ్ లైట్ సినిమాలో సదా ఓ వేశ్య పాత్ర పోషించింది. ఈ పాత్ర కోసం త‌నను తాను చాలా ప్రిపేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీమతి 21 ఎఫ్ పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎలా ఉండ‌బోతున్నాయి అనే నేప‌థ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ట్రాఫిక్ సిగ్న‌ల్ కూడా ఇలాంటి క‌థే. పైగా క‌రీనాక‌పూర్, విద్యాబాల‌న్, అనుష్క లాంటి టాప్ హీరోయిన్లు కూడా వేశ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్పుడు ఇదే లిస్ట్ లోకి స‌దా కూడా వ‌స్తుంది. కానీ గ‌త పాత్ర‌ల‌తో పోలిస్తే స‌దా కారెక్ట‌ర్.. సినిమా భిన్నమైన కోణంలో ఉంటుందంటున్నాడు ద‌ర్శ‌కుడు మాజిద్. సదాతో పాటు ఈ చిత్రంలో రిత్విక కూడా వేశ్య‌గా న‌టించింది. ట్రైల‌ర్ లో కూడా బాగానే అందాలు ఆర‌బోసింది స‌దా. మొత్తానికి అవ‌కాశాలు లేక చివ‌రికి వేశ్య పాత్ర‌లో త‌న‌ను తాను నిరూపించుకోడానికి సిద్ధ‌మైంది స‌దా. మ‌రి చూడాలి.. ఈ శ్రీమతి 21 ఎఫ్ సదా కెరీర్ లో వెలుగు నింపుతుందో లేదో..?

More Related Stories