సాహో రెండో రోజు కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్..saaho_seconday_collections
2019-09-01 15:30:11

ఒక భారీ సినిమా విడుదలైనప్పుడు దాని చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎంతగా ఉంటుందో సాహో సినిమా కలెక్షన్లు చూస్తుంటే అర్థమైపోతుంది. ఈ సినిమాకు తొలి రోజు చాలా తేడా టాక్ వచ్చేసింది. ప్రభాస్ రెండేళ్ల కష్టాన్ని సుజీత్ పూర్తిగా నాశనం చేశాడు అంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే కలెక్షన్ విషయంలో మాత్రం మరోలా కనిపిస్తుంది సాహో. తొలి రోజు ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది సాహో. దీనికి ముందు కేవలం బాహుబలి 2 మాత్రమే ఈ రికార్డు అందుకుంది. ఇంకా రెండో రోజు కూడా ఈ సినిమా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో 30 కోట్లు వసూలు చేసింది సాహో. తొలిరోజు కంటే 6 కోట్లు అదనంగా తీసుకురావడం దర్శక నిర్మాతలకు సంతోషాన్ని కలిగించే విషయం. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా తొలిరోజు 36 కోట్లకు పైగా షేర్ తీసుకువచ్చిన సాహో రెండో రోజు దాదాపు 20 కోట్ల వరకు తీసుకు వచ్చిందని తెలుస్తోంది.

నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం సాహో వెనక్కి తగ్గడం లేదు. వినాయకచవితి సెలవు రోజు కూడా ఉండటంతో మరో రోజు అదనంగా బాక్సాఫీస్ దగ్గర సాహో సత్తా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. 4 రోజుల్లో దాదాపు 300 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సాహో. ఒకవేళ ఇదే జరిగితే కమర్షియల్ గా సాహో బయట పడినట్లే. అయితే ప్లాన్ ప్రకారం అంత జరుగుతుందా లేదా అనేది మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఓవర్సీస్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బాలీవుడ్లో మాత్రమే సాహో కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. అక్కడ ఓపెనింగ్స్ విషయంలో సాహో అద్భుతాలు చేస్తుంది. ఇదే కొనసాగితే హిందీలో సాహో సేఫ్ జోన్ కు రావడం ఖాయం. మొత్తానికి కూడా 300 కోట్లకు పైగా వసూలు చేస్తే కానీ సాహో హిట్ సినిమా అనిపించుకోదు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా ఇదే జోరు కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.

More Related Stories