సోలో బ్రతుకే సో బెటర్ అంటోన్న ధరమ్ తేజ్...సినిమా మొదలెట్టేశాడు  Sai Dharam
2019-10-07 09:49:23

చిత్రలహరి సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వేగం పెంచాడు. వరుసపెట్టి సినిమాలను అంగీకరిస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే, సుబ్బు అనే కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి సాయి ధరమ్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించనుంది. 

ఇక ఈ సినిమా షూటింగ్ కూడా అతి త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని, ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది.  కాగా, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతోన్న సుబ్బు ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ధరం తేజ్ ఫ్రీ అవ్వగానే పట్టాలెక్కనుందని అంటున్నారు. ఇప్పటికే కొత్త లుక్స్ ట్రై చేస్తున్న తేజూ ఈ సినిమాలో మరో కొత్త అవతారంలో కనిపించనున్నారట. ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలు తేజూ చేతిలో ఉన్నాయి. దర్శకులు దేవాకట్ట, మేర్లపాక గాంధీలతో సాయి ధరమ్ సినిమాలు ఒప్పుకున్నారు. వీటికి సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

More Related Stories