సాహసం చేయరా డింభకా అంటున్న సాయి ధరమ్ తేజ్..Sai Dharam Tej
2020-03-13 00:34:03

ఒక్క హిట్ వచ్చిందంటే చాలు మళ్ళీ కెరీర్ గాడిన పడుతుంది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ విషయంలో కూడా అదే జరిగింది. వరుస పరాజయాలతో కెరీర్లో బాగా వెనుకబడిపోయిన సాయి.. 2019లో రెండు విజయాలు అందుకున్నాడు. చిత్రలహరి సినిమా పర్లేదు అనిపించినా.. ప్రతిరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగా మేనల్లుడు. ఈ రెండు సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు సాయి. అయితే ఇప్పటి వరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మాత్రం ప్రయోగాలకు తెర తీస్తున్నాడు. 

ముఖ్యంగా ప్రస్తుతం నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటరూ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. ఇందులో ప్రయోగాలకు తావులేదు. మే 1న సినిమా విడుదల కానుంది. సుబ్బు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కానీ ఆ తర్వాత దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇది పూర్తిగా ఎమోషనల్ ఎంటర్ టైనర్. ఈ సినిమా ఓపెనింగ్ ఎప్పుడు జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ కి అతిథిగా వచ్చాడు. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో అసలు ట్రై చేయని జోనర్ ఇది. ఇందులో సాయి క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. 

నటుడిగా ఇది మెగా మేనల్లుడి మరో స్థాయికి తీసుకుపోయే సినిమా అవుతుందని.. కచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటుడిగా మరింత ఎదుగుతాడు అంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాతో పాటే దిల్ రాజు నిర్మాణంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు సాయి. ఇది కూడా పూర్తిగా ప్రయోగాత్మక సబ్జెక్టుతో తెరకెక్కబోతుంది. కొత్త దర్శకుడు ఈ సినిమాలో రూపొందించబోతున్నాడు. మొత్తానికి రెండు విజయాలు వచ్చేసరికి కెరీర్లో నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్.

More Related Stories