సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మోషన్ పోస్టర్ విడుదల



Sai Dharam Tej
2021-01-25 18:01:42

వైవిధ్య దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై హీరో సాయి ధరమ్ తేజ్ అప్డేట్ ఇచ్చారు. సినిమా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ను ఆయన విడుదల చేశారు. ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న "రిపబ్లిక్" ను ఈ సినిమా టైటిల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని తేజ్ ట్వీట్ చేశారు. కాగా రిపబ్లిక్ సినిమా మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మోషన్ పోస్టర్ లో తేజ్ డైలాగ్స్ అదరగొట్టాడు.

"ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకుడు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టు ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పు ఒకరు సరిదిద్దుకుంటూ..సాగినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రభుత్వం అవుతుంది. అదే అసలైన రిపబ్లిక్" అంటూ తేజ్ డైలాగ్స్ కొట్టాడు. సినిమాలో ఐష్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. సినిమాను బాలాజీ సినీ మీడియా నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

More Related Stories