లిప్ లాక్ ఇస్తోన్న సాయి పల్లవి..అయ్యేపనేనా  Sai Pallavi
2020-05-19 19:31:38

అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పుడు లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా దెబ్బ గట్టిగా ఉన్నా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా తమ షూట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి ఆపక తప్పని పరిస్థితి. అయితే ఈ సినిమాని అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఇది డ్యాన్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో నడిచే ప్రేమకథ అని చెబుతున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవిలలో ఒకరు పిల్లలకి డ్యాన్స్ నేర్పించే పాత్రలో నటించనున్నారని మరొకరు వారిని చూసి ప్రేమలో పడతారని అంటున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర అంశం ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో సాయి పల్లవి-చైతూల మధ్య లిప్ లాక్ ఇచ్చే సీన్ ఉందని సమాచారం. వర్షం నేపధ్యంలో ఒక సీన్ ఉంటుందని ఆ సీన్ లో ఆమె చైతుకి లిప్ లాక్ ఇస్తుందని స‌మాచారం. దీనిపై త్వరలోనే ఒక లుక్ ని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోని. అందుకే దీనికి సంబంధించి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రలలోనే నటించలేదు. కానీ ఏకంగా లిప్ లాక్ అంటే మామూలు విషయం కాదు మరి. చూద్దాం ఇది ఎంతవరకు నిజం అవుతుందో ?

More Related Stories