బంపరాఫర్2 తో వస్తున్న పూరీ తమ్ముడు



Bumper Offer 2
2021-03-06 16:25:37

టాలీవుడ్‌ డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ త‌మ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సాయిరాం శంక‌ర్‌.  143 అనే సినిమాతో సాయిరాం శంక‌ర్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో వ‌రుస ఆప‌ర్ల‌తో బిజీ అయ్యారు. ఈ సినిమాకు అన్న పూరీ జ‌గ‌న్నాత్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. సాయిరాం శంక‌ర్ చాలా సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ 143 సినిమా త‌ర‌వాత ఆయ‌న‌కు గుర్తింపు తెచ్చిన సినిమా బంప‌రాఫ‌ర్‌. 

ఈ సినిమా 2009లో విజ‌యం సాధించి మంచి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా బంప‌రాఫ‌ర్ 2 ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు జ‌య ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఉగాది శుభాకాంక్షలతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మ‌నిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. సినిమాలో హీరోయిన్ ఇత‌ర తారాగ‌ణం వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర‌యూనిట్ వెళ్ల‌డించింది. 
 

More Related Stories