ఇక రివర్స్ బాలీవుడ్ టూ టాలీవుడ్khan
2019-08-24 19:51:07

మొట్టమొదటిసారిగా సల్మాన్‌ ఖాన్‌ నటించిన బాలీవుడ్ సినిమా దక్షిణాది భాషలన్నిటిలోనూ విడుదల కాబోతోంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘దబాంగ్‌ 3’ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇక తెలుగు వెర్షన్‌ రిలీజ్ బాధ్యతలను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకి కూడా నటుడు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. 2010లో ‘దబాంగ్‌’ సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్‌ 2’ కూడా మంచి విజయం సాధించింది.

దాంతో ఈ పార్ట్ 3 కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.'దబాంగ్‌ 3'లో మహేశ్‌ ముఖర్జీ కుమార్తె సాయీ నటిగా అరంగేట్రం చేస్తోంది. ఇందులో ఈమెతో పాటు సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌, ప్రమోద్‌ ఖన్నా, సుదీప్‌ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సుదీప్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక అందుతున్న సమాచారం మేరకి ఈ సినిమాని తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మనవాళ్ళు బాలీవుడ్ వెళ్లి అక్కడ ఎలా అయితే ఈవెంట్స్ చేస్తున్నారో సల్మాన్ ని తెచ్చి ఇక్కడ భారీ ఈవెంట్ జరిపేందుకు కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్లాన్ చేశుందని అంటున్నారు. ఇక దీని మీద మరింత సమాచారం అందాల్సి ఉంది.

More Related Stories