బన్నీపై సల్మాన్ ఖాన్ ప్రశంసలు...హ్యాపీగా ఉందంటూ బన్నీ రిప్లై Salman Khan
2021-04-26 20:26:05

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల్లో పాటలు డ్యాన్స్ ల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు. సినిమాలో పాటల గురించి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఆ పాటలను ఎంజాయ్ చేస్తూ స్టెప్పులు వేస్తారు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజె సినిమాలోనూ "సీటిమార్" పాట అలాంటిదే. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు బన్నీ దుమ్మురేపారు. 

అయితే ఇప్పుడు ఇదే పాటను దేవీశ్రీ ప్రసాద్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా రాధే కోసం రీమేక్ చేశారు. సల్మాన్ ఖాన్ తనకు ఈ పాట నచ్చడం తో అడిగి మరీ రీమిక్స్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈరోజు హిందీ సీటీమార్ పాటను విడుదల చేసారు. ఈ నేపథ్యంలో బన్నీ పై సల్మాన్ ప్రశంసలు కురిపించారు. "ఈ పాటలో మీ పర్ఫామెన్స్, డ్యాన్స్ , స్టైల్ బాగున్నాయని అన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండండి బ్రదర్" అంటూ సల్మాన్ ట్వీట్ చేశారు. 

ఇక ఈ ట్వీట్ కు అల్లుఅర్జున్ రిప్లై ఇచ్చారు. "మీ నుండి కాంప్లిమెంట్ అందుకున్నందుకు ఆనందంగా ఉంది సల్మాన్ గారు. మీ రాధే సినిమా స్క్రీన్ పై మ్యాజిక్ చేసి అభిమానులు మీకు సీటీమార్ వేయాలని కోరుకుంటున్నా..మీ ప్రేమకు ధన్యవాదాలు." అంటూ బన్నీ పేర్కొన్నారు.

More Related Stories