సైరా నరసింహారెడ్డిని దత్తత తీసుకుంటున్న పెద్ద మనుషులు..syeraa
2019-09-20 07:18:57

బాహుబలి తర్వాత ఆ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సాహో. అయితే అది యాక్షన్ ఎంటర్ టైనర్. మళ్లీ బాహుబలి తరహాలోనే యుద్ధాలు, గుర్రాలు అంటూ వస్తున్న సినిమా సైరా. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. పైగా ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. దాంతో తనకున్న పరిచయాలను కూడా ఈ చిత్రం కోసం వాడేస్తున్నాడు ఈయన. ముఖ్యంగా ప్రతీ విషయంలోనూ తన పిఆర్‌ను సైరా కోసం వాడేస్తున్నాడు రామ్ చరణ్. తాజాగా విడుదలైన సైరా ట్రైలర్ ను బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తో ట్వీట్ చేయించాడు రామ్ చరణ్. దానివల్ల చాలా మందికి ఈ ట్రైలర్ రీచ్ అయింది. అంతేకాదు.. ట్వీట్ చేస్తూ రామ్ చరణ్‌, చిరంజీవి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపాడు సల్మాన్ ఖాన్. అలా సల్లూ భాయ్ ఫ్యాన్స్ సైరాకు ఫది అయిపోయారు.

ఇప్పటి వరకు సైరాకు హిందీలో బజ్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు మొదలయ్యాయి. తమిళనాట కూడా రజినీకాంత్ సైరాను ప్రశంసించాడు. ఇక తెలుగులో ఆ బాధ్యత రాజమౌళి తీసుకుంటున్నాడు. సైరా ట్రైలర్ చూసి అద్భుతం అంటూ ట్వీట్ చేసాడు రాజమౌళి. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలోనే నటిస్తున్నాడు రామ్ చరణ్. మగధీర తర్వాత రాజమౌళితో వచ్చిన దూరాన్ని పూర్తిగా తగ్గించుకుని మళ్లీ అతనికి బాగా క్లోజ్‌ అవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు రామ్ చరణ్‌. పైగా రాజమౌళికి ఉన్న క్రేజ్ ను సైరా కోసం వాడేస్తున్నాడు ఈయన. మెగాస్టార్‌ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కాబట్టి చాలా మంది హీరోలు, దర్శకులు కూడా కాదనకుండా ఈ చిత్రానికి ఫ్రీ ప్రమోషన్ చేసి పెడుతున్నారు. పైగా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న భారీ సినిమాలకు అంతా తలవంచి దండం పెడుతున్నారు. ఇప్పుడు సైరాకు కూడా ఇదే గౌరవాన్ని అందిస్తున్నారంతా.

More Related Stories