తమన్ ఏదో మాయ చేసాడు.. అల వైకుంఠపురములో పాట అదిరింది..  Samajavaragamana
2019-09-28 12:31:52

తమన్ అంటే పాత మ్యూజిక్ ఇస్తాడని పేరుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈయన విడుదల చేసిన అల వైకుంఠపురంలో పాట అదిరిపోయింది. సామజవరగమనా అంటూ సాగే ఈ పాటకు తొలిసారి వినగానే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు.. ఆ చూపులనాల్లా తొక్కుకువెళ్లకు దయలేదా అసలు.. అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన లిరిక్స్ పాటకు ప్రాణం పోసాయి. అవి విన్న తర్వాత అబ్బా ఏముందిరా పాట అనిపించక మానదు. దానికితోడు తమన్ క్లాసిక్ మ్యూజిక్.. వెనక బ్యాగ్రౌండ్ స్కోర్.. ట్రూప్.. వెస్ట్ర్రన్ మ్యూజిక్ తో ఉన్న టీం.. అన్నీ కలిపి అద్భుతంగా కుదిరాయి. సిద్ శ్రీరామ్ వాయిస్ తోడవ్వడంతో ఈ పాట మరింత మధురంగా మారింది. ఈ ఏడాది టాప్ హిట్స్ లో కచ్చితంగా ఈ పాట కూడా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా ఈ పాటతో మరోసారి తమన్ మాయ చేయడం ఖాయం. అల వైకుంఠపురములో సినిమాను అల్లు అరవింద్, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.

More Related Stories