అమ్మో సమంతా మామూలుది కాదుగా...వంద కేజీలాsamantha
2020-03-08 14:55:30

తెలుగులోనే కాక దక్షిణాది బాషలన్నిటిలో టాప్ రేసులో దూసుకుపోతున్న హీరోయిన్లలో సమంత ఒకరు. అక్కినేని కోడలయ్యాక కాస్త గ్లామరస్ పాత్రలు ఆపేసిన ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలలపై దృష్టి పెట్టి నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. తాజాగా జాను అని తమిళ ‘96’ తెలుగు రీమేక్‌ తో ముంచుకు వచ్చిన ఆమె మరే సిఇమా ప్రకటించలేదు. ఆమె ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌ లో నటింటిస్తున్నారు. తాజాగా సమంత తన ఫిట్‌నెస్ వీడియో ఒకదానిని సోషల్ మీడియా లో షేర్ చేశారు. నిజానికి ఆమె ఫిజికల్ ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సమంత 100 కిలోల బరువున్న బార్బెల్‌ను సులువుగా ఎత్తి సంచలనం రేపింది. ఆ వీడియో షేర్‌ చేసిన శామ్‌.. 'మరలా నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది నా నేస్తమా.. 100 కేజీల సుమో డెడ్‌ లిఫ్ట్‌' అని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

More Related Stories