ఎప్పుడూ కుక్కతోనే సరిపోతుందా సమంతాజీ..?samantha
2020-05-14 21:01:37

ఇప్పుడు ఇదే అనుమానం కలుగుతుంది అభిమానులకు కూడా. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది సమంత. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. తనతో పాటు భర్త నాగ చైతన్యను కూడా సోషల్ మీడియాలోకి లాగుతుంది ఈమె. ఆయనేం చేస్తున్నాడో కూడా అభిమానులకు చెప్తుంటుంది సమంత. ఇదిలా ఉంటే క్వారంటైన్ టైమ్ లో ఎక్కువగా ఫోటోలు అప్ లోడ్ చేస్తూనే ఉంది స్యామ్. అభిమానులతో ముచ్చటించడం అయితే లేదు కానీ రోజూవారి ఏం చేస్తున్నారనేది మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇది చూసి ఫ్యాన్స్ కూడా ఓహో సమంత, చైతూ ఇలా ఉన్నారా క్వారంటైన్‌లో అనుకుంటున్నారు. అయితే సమంత మాత్రం ఈ మధ్య ఎప్పుడు చూసినా కూడా తన పెంపుడు కుక్కతోనే కనిపిస్తుంది.

పైగా దీనికి హ్యాష్ అక్కినేని అనే పేరు కూడా పెట్టుకున్నారు ఈ దంపతులు. కుక్కకు కూడా ఇంటి పేరు ఇచ్చేసారు.. మొన్న దాని పుట్టినరోజును కూడా ఘనంగా జరిపారు. అసలు కుక్కతో సమంతకు ఉన్న రిలేషన్ చూసి అమ్మో అనుకుంటున్నారు నెటిజన్లు. కొందరైతే ఏకంగా ఎప్పుడూ కుక్కనే కాదు.. అప్పుడప్పుడూ మా చైతూను కూడా కాస్త పట్టించుకోండి సమంత గారూ అంటూ నెటిజన్లు కమెంట్స్ కూడా పెడుతున్నారు. అవి చూసి నవ్వుకుంటుంది స్యామ్. మరోవైపు పెళ్లికి ముందు కుక్కలంటే చిరాకు పడే చైతూ కూడా ఇప్పుడు సమంత దెబ్బకు కుక్కే నా ప్రాణం అంటున్నాడు. ఈ ఇద్దరూ కలిసి హాయిగా ఈ కుక్కతోనే తమ అపార్ట్‌మెంట్ అంతా రౌండ్స్ కొడుతున్నారు. ఈ పోటోలు కూడా సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతున్నాయి.

More Related Stories