సమంత అందుకు సిద్ధపడే పెళ్లి చేసుకుందట Samantha
2020-12-15 20:40:00

టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని ఇటు సినిమాలతోను అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోను ఫుల్ బిజీగా ఉంది. పెళ్లికి ముందు రొమాంటిక్ ప్రేమకథ చిత్రాల్లో నటించిన సమంత పెళ్లి తరవాత మాత్రం తన పాత్రకు, నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రల్లోనే నటిస్తోంది. ఇక ప్రస్తుతం సామ్ జామ్ పేరుతో సమంత ఆహా లో ఒక షో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఎపిసోడ్ లో సమంత తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

 సమంత మాట్లాడుతూ... నిజంగా నేను అదృష్టవంతురాలిని అనే చెప్పాలి. పెళ్లి తరవాత కూడా నేను వరుస సినిమాలలో నటిస్తున్నా. పెళ్లి తరవాత నాకు అవకాశాలు వస్తాయని ఊహించలేదు. మొదట భయపడ్డాను కూడా. దానికి సిద్ధపడే పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లి తరవాత కూడా స్టార్ హీరోయిన్ గా మెరావాలనో...లేదంటే కెరీర్ కు పెళ్లి అడ్డంకి కాదని నిరూపించుకోడానికో నేనేమి ప్లాన్ చేయలేదు. అలా జరిగిపోయింది. పెళ్లి తరవాత రంగస్థలం లాంటి పెద్ద హిట్ వచ్చింది. ఆ తరవాత ఓ బేబీ రావడమే కాకుండా ఎన్నో అద్భుతమైన అవకాశాలు వాడుతున్నాయని పేర్కొంది.

More Related Stories