బుల్లితెరపై కూడా జాను డిజాస్టర్.. సమంతకు అవమానం..sam
2020-04-25 08:04:56

తమిళనాట చరిత్ర సృష్టించిన 96 సినిమా తెలుగులో ఎందుకో డిజాస్టర్ అయిపోయింది. ఈ సినిమాను సమంత, శర్వానంద్ జంటగా జాను పేరుతో అదే దర్శకుడితో రీమేక్ చేశాడు దిల్ రాజు. ఈయన 96 సినిమా రీమేక్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు తెలుగులో కొంతమంది హీరోలు వార్నింగ్ కూడా ఇచ్చారు. అనవసరంగా దీన్ని తెలుగులో రీమేక్ చేసి చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు అని ఆయనకు సూచించారు. కానీ దిల్ రాజు వినలేదు. దాని ఫలితం విడుదలైన వారానికే జాను దుకాణం సర్దేసింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ఇటీవల స్టార్ మా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పేరుతో టెలికాస్ట్ చెయ్యగా కేవలం 7.27 రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది. లాక్ డౌన్ ఉన్న కూడా ఎందుకో మరి జాను సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. దాంతో బుల్లితెరపై కూడా ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. దీనికంటే సైరా నరసింహారెడ్డి రెండోసారి ఎక్కువ రేటింగ్ తీసుకొచ్చింది. ఇక రవితేజ ఆల్ టైం డిజాస్టర్ నేల టికెట్ సినిమా కూడా జాను సినిమాలతో సమానంగా రైటింగ్ తీసుకొచ్చింది. దాంతో బుల్లితెరపై సమంత సినిమాకు ఎంత ఘోరమైన పరాభవం ఎదురైంది అనేది అర్థం అవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ముక్తకంఠంతో వెనక్కి తిప్పి పంపించారు అని అర్థమవుతుంది. 

More Related Stories