గోవాలో సమంత, చైతన్య న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ Samantha Chaitanya
2020-12-30 21:09:54

కొత్త ఏడాదికి ఇంకా రెండు రోజులు ఉండగానే న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకునేందుకు అందరూ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చైతన్యతో కలిసి సమంత న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకునేందుకు గోవా బయల్దేరారు. న్యూ ఇయర్‌ వేడుకలను ఎప్పట్లాగే ఈ ఇద్దరూ గోవాలో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అయితే వీరు హైదరాబాద్ నుండి  గోవా బయల్దేరిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఎయిర్‌పోర్టులో గ్రే, బ్లాక్‌ దుస్తుల్లో సమంత.. వైట్‌ టీ షర్టు, గ్రే కార్గో ప్యాంట్‌లో నాగచైతన్య కనిపించారు. ఇద్దరూ ముఖానికి మాస్కు ధరించి ఉన్నారు.  ఇదిలా ఉండగా నవంబర్‌ చివరి వారంలో నాగ చైతన్య 34వ పుట్టినరోజును సమంత మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల వెకేషన్‌ అనంతరం వీరిద్దరూ ప్రస్తుతం గోవా వెళుతున్నారు.

More Related Stories