వ్యవసాయం చేస్తున్నానంటోన్న సమంతాSamantha
2020-06-16 19:25:56

కరోనా లాక్ డౌన్ మనుషుల్లో మార్పులు తెస్తోంది. అవి ఏ రకాల మార్పులు అయినా కానీ, డబ్బున్నోడు లేనోడికి పెట్టడం నేర్చుకున్నాడు. అలాగే సెకను కూడా ఖాళీగా లేకుండా ఉండే సినిమా వాళ్ళు కూడా రోజుల తరబడి వచ్చిన ఖాళీని ఎలా పూరించాలో నేర్చుకున్నారు. కొంత మంది తరువాతి సినిమాల కోసం ప్రాక్టీస్ చేస్తోంటే, కొందరు తమకి ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు. మన సమంతా కూడా తనకు ఇష్టమైన గార్డెనింగ్ నేర్చుకుని మరీ చేస్తోంది. ఆర్గానిక్ పద్ధతి లో పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిది కావడంతో సమంత తన ఇంటి టెర్రస్ పై గార్డెన్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ‘వ్యవసాయం అంటే నాకు చాలా ఇంటరెస్ట్ అయితే వృత్తిపరంగా బిజీగా ఉండటంతో ఎప్పుడూ అటు వైపు దృష్టిపెట్టలేదని టెర్రస్‌ మీద కృత్రిమంగా ఏర్పాటు చేసిన చిన్న పొలంలో అర్బన్‌ వ్యవసాయం చేస్తున్నా’ అని చెప్పుకొచ్చింది సమంత. సోషల్‌మీడియాలో ఆమె షేర్‌ చేస్తున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

More Related Stories