సమంత అక్కినేని వ్యవసాయం.. అక్కినేని కోడలు అదిరిపోయే చిట్కాలు..Samantha Akkineni
2020-07-10 20:47:12

సమంత అక్కినేని సినిమాలతోనే కాదు బయట పనులతో కూడా చాలా బిజీగా ఉంటుంది. పైగా రెండు నెలలుగా సినిమాలు కూడా లేవు. షూటింగ్స్ కూడా లేవు.. దాంతో ఇంటికే పరిమితం అయిపోయారు సమంత చైతూ. కావాల్సినట్లుగా మార్చుకుని లాక్ డౌన్ పీరియడ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఇద్దరూ. ఇన్నాళ్లూ కేవలం నటిగానే ఉన్న సమంత ఇప్పుడు రైతుగా మారబోతుంది. సమంత చైతూకు హైదరాబాద్‌లో మంచి ఇల్లు ఉంది. విశాలంగా ఉన్న ఈ ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ సహా సకల సదుపాయాలు ఉన్నాయి. మురళీ మోహన్ తన కొడుకు కోసం కట్టుకున్న ఇంటిని నాగార్జున రిఫరెన్సుపై నాగ చైతన్యకు అమ్మేసాడు. ఇప్పుడు ఈ ఇంటి టెర్రస్‌పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించేందుకు సిద్ధమైపోయింది సమంత అక్కినేని.

దానికి కావాల్సిన మెళకువలు కూడా నేర్చుకుంటుంది ఈ భామ. దీన్ని మిద్దె తోట అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం సిటీస్ లో ఇది బాగా ఫేమస్. ఇప్పుడు సమంత కూడా ఇదే చేయబోతుంది. మిద్దె తోటతో తనకు కావాల్సిన కూరగాయలను పండించాలని చూస్తుంది. అలాగే పండిస్తుంది కూడా. అలా పండించిన కూరగాయలనే వంటకు ఉపయోగించుకుంటుంది సమంత. గత మూడు నెలలుగా తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంటూనే ఉంది సమంత. ఇటీవల హౌస్ గార్డెనింగ్ పై దృష్టి పెట్టిన సమంత బయో ఎంజైములను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుంది కూడా. వాటితోనే ఇంటిని శుభ్రం చేసుకుంటుంది సమంత. ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా.. వాటిని వాడకుండా దూరంగా ఉంచుతూ సేంద్రీయంగానే ఇంటిని శుభ్రం చేసుకోవచ్చని చెప్తుంది సమంత. 

More Related Stories