బిగ్ బాస్‌లో 5 ఎపిసోడ్స్ కోసం సమంత పారితోషికం.. నాగార్జునను మించిందిగా..  Samantha
2020-10-28 19:09:32

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం నాగార్జున అక్కినేని హిమాలయాలకు వెళ్లిపోవడంతో బిగ్ బాస్ షోను హోస్ట్ చేయడానికి సమంత ముందుకొచ్చింది. మామ బాధ్యతలను కోడలికి అప్పగించి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ చేసారు స్టార్ మా యాజమాన్యం. పైగా ఫస్ట్ ఎపిసోడ్ లోనే కుమ్మేసింది అక్కినేని కోడలు. మామను మించిన కోడలు అనిపించేసుకుంది. హౌజ్ మేట్స్ తో సమంత మాట్లాడిన విధానం.. వాళ్లను కన్విన్స్ చేసిన తీరు కూడా అద్భుతం అనిపించాయి. దాంతో తొలి ఎపిసోడ్ లోనే హోస్టుగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సమంత. అయితే నాగార్జున మిస్ అవుతున్న 5 ఎపిసోడ్స్ సమంత హోస్ట్ చేయబోతుంది. దీనికోసం ఈమె తీసుకున్న రెమ్యునరేషన్ మాత్రం హాట్ టాపిక్ అయిపోయిందిప్పుడు. 

ఎందుకంటే నాగార్జున కంటే భారీగా ఈమె పారితోషికం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. సీజన్ మొత్తానికి కలిసి నాగార్జున 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అయితే సమంత మాత్రం కేవలం 5 ఎపిసోడ్స్ కోసమే ఏకంగా 2.10 కోట్లు అందుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అంటే ఎపిసోడ్‌కు 42 లక్షలన్నమాట. నాగార్జునకు అంత ఇవ్వట్లేదు స్టార్ మా. కానీ సమంతకు మాత్రం ఇచ్చేస్తుంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. సమంతకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత పే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా 5 కేవలం 5 ఎపిసోడ్స్ కోసం కోట్ల రూపాయలు అందుకుంటున్న సమంతను చూసి వారెవ్వా అంటున్నారు అభిమానులు. 

More Related Stories