సమంత కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.?samantha signed for new telugu film
2021-09-17 23:09:25

తన అందం, అభినయంతో ఆకట్టుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిన సమంత ఇటీవల శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. ఆతర్వాత నటనకు కాస్త బ్రేక్ ఇస్తున్నానని సమంత ప్రకటించడం జరిగింది. అయితే.. ప్రస్తుతం సమంత బాలీవుడ్ పై దృఫ్టి పెడుతుందని తెలుగులో ఇక సినిమాలు చేయడం అనుమానమే అన్నట్టుగా టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే.. నాగచైతన్య, సమంత మధ్య విభేదాలు వచ్చాయని కూడా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలోను, అలాగే మీడియాలోను ఎంత ప్రచారం జరిగినా.. ఇటు చైతన్య కానీ.. అటు సమంత కానీ ఏమాత్రం స్పందించడం లేదు.

అయితే.. ఇప్పుడు సమంత తెలుగులో ఓ సినిమాకి సైన్ చేసి షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. ఇంతకీ సమంత సినిమా ఎవరితో అంటే… నందమూరి బాలకృష్ణ ఆదిత్య369, వంశానికొక్కడు, నానితో జెంటిల్మెంట్, సుదీర్ బాబుతో సమ్మోహనం ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన సీనియర్ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ బ్యానర్ లో సమంత ఓ చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పింది. నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని ప్రకటిస్తారని సమాచారం.

ఇంత వరకు తెలుగు తెరపైనే కాదు, ఇతర ఏ భాషలోనూ రాని కథాంశమట. టైటిల్, ఇతర నటీనటులు ఇతర వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. మొత్తానికి సమంత రూటు మార్చింది. ఇంకెన్ని సినిమాలకు ఓకే చెబుతుందో..? చూడాలి.
 

More Related Stories