లాక్‌డౌన్‌లో తన ఒరిజినల్ చూపించిన సంపూర్ణేష్ బాబు.. Sampoornesh Babu
2020-04-24 14:01:06

సంపూర్ణేష్ బాబు.. ఇండ‌స్ట్రీలో ఉండాలంటే అందం అక్క‌ర్లేదు.. అదృష్టం ఉంటే చాల‌ని చెప్పిన హీరో. త‌న‌ను తానే బర్నింగ్ స్టార్ గా ప్ర‌క‌టించుకుని తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు సంపూ. సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ లా హృద‌య కాలేయం సినిమాతో త‌న‌ను తానే స్టార్ గా అనౌన్స్ చేసుకున్నాడు సంపూ. ఆ సినిమా విజ‌యం సాధించ‌డంతో సంపూ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. సెటైర్ల‌కు కొల‌వుగా ఉండే సంపూ సినిమాలంటే కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు మ‌హా ఇష్టం. గతేడాది ఈయన నటించిన కొబ్బ‌రిమ‌ట్ట సినిమా కూడా మంచి లాభాలను తీసుకొచ్చింది. హృద‌య కాలేయంకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స్టీఫెన్ శంక‌ర్ కొబ్బ‌రిమ‌ట్ట‌కు క‌థ‌, స్క్రీన్ ప్లే అందించాడు. 

ఇదిలా ఉంటే తాజాగా లాక్ డౌన్ సందర్భంగా ఇంటి దగ్గరే ఉండి తన వృత్తి చేసుకుంటున్నాడు సంపూ. ప్రస్తుతం ఇండస్ట్రీలో బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ నడుస్తుంది. అందులో భాగంగానే తన సొంత కంసాలీ వృత్తిని చేస్తూ వీడియో పోస్ట్ చేసాడు సంపూర్ణేష్ బాబు. రాజు పేద తేడా లేదు... నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ.. మా ఆవిడ కోసం, నా పాత "కంశాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను అంటూ వీడియో పోస్ట్ చేసాడు సంపూర్ణేష్ బాబు. 

More Related Stories