నటి సూసైడ్...పురుగుమందు తాగుతూ వీడియో Chandana
2020-06-02 18:43:55

కన్నడ నాట టీవీ సీరియల్స్ లో నటిస్తున్న నటి చందన ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. ఆత్మహత్యకు ముందు పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న చందన.. ప్రియుడు దినేష్ తనను మోసం చేశాడని, తన డబ్బులు వాడుకున్నాడని, తన కెరియర్‌ను అతడి కోసం త్యాగం చేశానని ఏడుస్తూ చెప్పింది,  ఇంతా చేస్తే అతడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని చెబుతూ పురుగు మందు తాగేసింది. 

అందుతున్న సమాచారం ప్రకారం.. హాసన్ జిల్లా బేలూరుకు చెందిన చందన, దినేష్ లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నటిస్తూనే పెళ్లి చేసుకుంటానని చందన చెప్పడంతో ఆ విషయాన్ని దినేష్తిరస్కరించాడు. దీంతో దినేష్కుటుంబ సభ్యుల వద్ద చందన తమ పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా వారు కూడా అవమానించి పంపించారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న చందన నిన్న బెంగళూరులోని తన నివాసంలో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని దానిని దినేష్ కు వాట్సాప్ చేసింది. వీడియో చూసిన దినేష్ కంగారు పడి చందన ఇంటికొచ్చి, అపస్మారక స్థితిలో పడి ఉన్న చందనను ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే చందన ప్రాణాలు కోల్పోయింది. చందన సెల్ఫీ వీడియో ఆధారంగా దినేష్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Related Stories