అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం..sundeep
2019-08-22 15:33:33

టాలీవుడ్ యువ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్ తల్లి సుజాత గురువారం ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రస్తుతం ముంబయిలో ఉన్న సందీప్ ఈ కబురు తెలిసిన వెంటనే హుటాహుటిన వరంగల్ కు బయలుదేరి వెళ్లారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలు రెండూ సూపర్ హిట్ కావడంతో ఆయనకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆయన ఇంకా తన తదుపరి సినిమాని ప్రకటించలేదు. మహేష్ తో ఒక సినిమా ఉంటుందని ప్రకటించినా అది ఎప్పుడు ఉంటుంది అనేది తెలియలేదు. అయితే ప్రభాకర్ రెడ్డి, సుజాత దంపతులకు సందీప్ రెడ్డి, ప్రణయ్ రెడ్డిలు సంతానం. సుజాత అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరిగే అవకాశముందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

 

More Related Stories