మహేష్ వర్సెస్ బన్నీ.. సంక్రాంతి విన్నర్ ఎవరు..allu
2020-01-13 12:08:33

అన్నింటి కంటే ఆసక్తి పుట్టిస్తున్న ప్రశ్న ఇదే ఇప్పుడు. ఇంతకాలం రెండు సినిమాలు రావాలి.. వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకున్నారు. ఇప్పుడు వచ్చాయి.. దాంతో చూసుకోవాల్సిన టైమ్ కూడా వచ్చేసింది. అటు బన్నీ.. ఇటు మహేష్ బాబు ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో దూకేసారు. సరిలేరు నీకెవ్వరు అంటూ తొలిరోజే 46 కోట్లు షేర్ తీసుకొచ్చాడు సూపర్ స్టార్. మరోవైపు అల వైకుంఠపురములో సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు టాక్ పరంగా చూసుకుంటే బన్నీకి చాలా ఎడ్జ్ ఉంది. ఈయన నటించిన అల వైకుంఠపురములో సినిమా పర్ఫెక్ట్ పొంగల్ ఫ్యామిలీ సినిమా అంటున్నారు.. ఇప్పటికే టాక్ బయటికి కూడా వచ్చేసింది. ఇదే సమయంలో సరిలేరు నీకెవ్వరు మాత్రం బాగోలేదని కాదు కానీ సంక్రాంతి కమర్షియల్ సినిమా అంతే. మరి ఇప్పుడు ఇది ఈ టాక్ తో నిలబడేనా.. లేదంటే పాజిటివ్ టాక్ వచ్చిన బన్నీ దూసుకుపోతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ రెండు చిత్రాల్లో చివరికి కచ్చితంగా ఒక్కటే సంక్రాంతి విన్నర్ అవుతుంది.. అయితే అసలు సిసలైన విన్నర్ ఎవరనేది మాత్రం ఇప్పుడు తేలదు.. దానికి మరో వారం రోజులు అయితే కచ్చితంగా పడుతుంది. అల వైకుంఠపురములో సినిమాకు వచ్చిన టాక్ చూస్తుంటే బన్నీ కాస్త ముందున్నాడు.. కానీ ముందొచ్చాడు కదా మహేష్ కూడా బి,సి సెంటర్స్ లో కుమ్మేసేలా కనిపిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కచ్చితంగా పండగ సెలవులు పూర్తయ్యే వరకు దుమ్ము లేపడం ఖాయం. ఆ తర్వాత ఏది నిలబడుతుందో అదే చివరికి నిలబడినట్లు. మధ్యలో కళ్యాణ్ రామ్ వస్తున్నా కూడా ఆయన మార్కెట్ చాలా తక్కువ. కాబట్టి లెక్కలోకి రానట్లే. మొత్తానికి ఈ రెండింట్లో విన్నర్ ఎవరో తేలడానికి కాస్త ఓపిక పట్టాల్సిందే.

More Related Stories