మళ్ళీ మొదలైన సారంగదరియా వివాదం..కోమలి పై నెటిజెన్ల ఫైర్

లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రికార్డు వ్యూవ్స్ తో ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషనల్ అవుతోంది. ఇక ఈ పాటతో సినిమా విడుదలకు ముందే మూవీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. సారంగదరియా పాట కోసమైనా సినిమాకు వెళ్లాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే ఇంత క్రేజ్ వచ్చిన ఈ పాటపై వివాదాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఫోక్ సింగర్ కోమలి ఈ పాట తనదే అంటూ పలు టీవీ ఇంటర్య్వూలలో ఆరోపణలు చేసింది. తనను చిత్ర యూనిట్ మోసం చేసిందని తెలిపింది. దాంతో ఈ వివాదానికి దర్శకుడు శేఖర్ కమ్ముల చెక్ పెట్టారు.
లవ్ స్టోరీ సినిమా కు ప్రీరిలీజ్ ఈవెంట్ పెడితే కోమలి తోనే పాటను పాడిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఈ పాటకు గానూ కోమలికి కొంత డబ్బు కూడా ఇస్తామని అన్నారు. దాంతో కోమలి ఈ పాట సినిమాలో పెట్టుకోవడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. ఇక ఈ వివాదం కాస్తా సద్దుమనింగింది అనుకుంటే తాజాగా మరో రచ్చ మొదలైంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో తాజాగా కోమలి మాట్లాడుతూ తన పాటను పెట్టుకోవడం వల్లనే అంత పెద్ద హిట్ అయ్యిందని వ్యాఖ్యానించింది. దీనికి సంభందించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో కొంతమంది నెటిజన్లు కోమలి పై ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో మంగ్లీ పాటను పాడటం వల్లే ఇంత క్రేజ్ వచ్చిందని చెబుతున్నారు. కోమలి గొంతు సాయిపల్లవికి సెట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు.