సరిలేరు నీకెవ్వరు 38 రోజుల కలెక్షన్స్.. అమెజాన్ విడుదల అప్పుడే.. Sarileru Neekevvaru
2020-02-19 23:21:41

సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా ఎలాంటి వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగ సెలవులని బాగానే కాష్ చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నెలరోజులు గడిచిపోవడంతో దాదాపు ఫైనల్ రన్ కలెక్షన్స్ బయటకు వచ్చేసాయి. 38 రోజులకు గాను 137 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్. 

యావరేజ్ టాక్ తో ఓపెన్ అయినా కూడా సంక్రాంతి సెలవులను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకొని సంచలన విజయం సాధించింది ఈ సినిమా. అన్ని ఏరియాలలో కూడా మహేష్ బాబు గత సినిమాల రికార్డులు తిరగరాసింది సరిలేరు నీకెవ్వరు. ముఖ్యంగా నైజాంలో 38 కోట్లు షేర్ వసూలు చేసింది. సీడెడ్ 18 కోట్లు.. ఉత్తరాంధ్ర 19 కోట్లు.. ఈస్ట్ 11 కోట్లు.. వెస్ట్ 7.30 కోట్లు.. కృష్ణాజిల్లా 8.8 కోట్లు.. గుంటూరు 10 కోట్లు.. నెల్లూరు 4 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు.. ఓవర్సీస్ 12 కోట్లు.. ఇలా ప్రపంచవ్యాప్తంగా 137 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. 

ఒక్క ఓవర్సీస్ మినహా మిగిలిన అన్ని చోట్ల సరిలేరు నీకెవ్వరు మంచి లాభాలు తీసుకొచ్చింది. విదేశాల్లో మాత్రం ఈ సినిమా దాదాపు కోటిన్నర నష్టాలు తీసుకొచ్చింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా పోటీలో ఉండటంతో సరిలేరు నీకెవ్వరుకు మూడు వారాల తర్వాత కలెక్షన్లు రాలేదు. ఏదేమైనా కూడా భారీగా విడుదల కావడంతో ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు సూపర్ స్టార్. మార్చ్ 7న ఈ చిత్రం అమెజాన్ లో విడుదల కానుంది.

More Related Stories