సరిలేరు నీకెవ్వరు : ఎట్టకేలకి గుమ్మడికాయ కొట్టేశారుmb
2019-12-19 02:16:32

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. గత కొంత కాలంగా హిట్స్ సాధిస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు. కామెడీ, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని ఎమోషన్స్‌ ఉండేలా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రతీ సోమవారం ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తున్నారు.  మహేష్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగబోతుంది. డిసెంబర్ నెల అంతా పాటల హడావిడితో కొనసాగించి జనవరి 1న ట్రైలర్ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈరోజు తో సినిమాకి గుమ్మడి కాయ కొట్టేశారు. దీంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిధిగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతేడాది భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్‌ను పిలిచిన మహేష్  ఈ సారి చరణ్ ని వాడుకోవాలని చూస్తున్నాడు.  

 

More Related Stories