ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజు కానుకగా పెళ్లిసంద‌D రెండ‌వ‌పాట‌ PelliSandaD
2021-05-20 17:59:30

శతాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు, క్లాస్‌ని, మాస్‌ని, ఫ్యామిలీస్‌ని, భ‌క్త‌జ‌న‌కోటిని అల‌రించిన ఎన్నో అపూర్వ చిత్రాల‌ని అందించిన ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజు మే23. ఈ విశిష్ట‌మైన రోజున ద‌ర్శ‌కేంద్రుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న‌`పెళ్లి సంద‌D` చిత్రంలోని రెండ‌వ‌పాట విడుద‌ల‌కానుంది. ఏప్రిల్ 28న విడుద‌లైన `పెళ్లిసంద‌D` చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ `ప్రేమంటే ఏంటి..` శ్రోత‌ల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో దాదాపుగా 4 మిలియ‌న్ల ఆర్గానిక్ ప్యూస్‌ సాధించి రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల కాంభినేష‌న్‌లో మ‌రో సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రంలోని రెండ‌వ‌పాట ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజునాడు విడుద‌ల‌వ‌డం విశేషం. 

ఈ సంద‌ర్భంగా...ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ - `` రాఘ‌వేంద్ర‌రావుగారు మ‌రియు కీర‌వాణిగారి కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్ర‌తి పాట త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. డైరెక్ట‌ర్‌గా నాకు ఇదొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సినిమా చాలా బాగా వ‌స్తోంది`` అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాయిబాబా కోవెల‌మూడి మాట్లాడుతూ - `` ఏడు రోజులు ప్యాచ్‌వ‌ర్క్ మిన‌హా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ తీసేశాక బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసి జూన్‌, జులైలో మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాం`` అన్నారు.

More Related Stories