ప్రేమికుల రోజును టార్గెట్ చేసిన శేఖర్ కమ్ముల Sekhar Kammula
2019-10-10 09:37:29

హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి యూత్ ఫుల్  సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. గత ఏడాది ఫిదా అంటూ వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో ఫిదా చేఇస్నా ఆయన ఆమధ్య ఒక సినిమా చేసి అవుట్పుట్ నచ్చక దానిని కిల్ చేసేసాడు. 

ఇక తాజాగా అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. నటీనటులను కూడా దాదాపుగా సెలెక్ట్ చేసేశారు. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ కూడా లైన్ లో ఉంది. 

ఇది డ్యాన్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో నడిచే ప్రేమకథ అని చెబుతున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవిలలో ఒకరు పిల్లలకి డ్యాన్స్ నేర్పించే పాత్రలో నటించనున్నారని మరొకరు వారిని చూసి ప్రేమలో పడతారని అంటున్నారు. డిసెంబర్‌ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారని సమాచారం. 

సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉంటున్న నేపధ్యంలో ఏ సినిమాని ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజున రిలీజ్ చేయచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కావడంతో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయడం మంచిదని దర్శకుడు భావిస్తున్నారని సమాచారం. ఇక నాగ చైత్యన్య, వెంకటేష్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ వెంకీమామ విడుదలకు సిద్ధంగా ఉంది. 
 

More Related Stories