శేఖర్ మాస్టర్ రప్ఫాడించాడు.. ఛమ్మక్ చంద్రతో స్కిట్ అదిరింది..  sekhar master
2019-09-03 08:44:38

టాప్ లేసిపోద్ది అంటూ ఇండస్ట్రీ టాప్ లేపేసాడు శేఖర్ మాస్టర్. ఆయన అంటే స్టార్ హీరోలకు ఇప్పుడు పిచ్చి. ఆయన డేట్స్ కోసం ఎగబడుతున్నారు నిర్మాతలు. ఒక్క పాట అయినా కొరియోగ్రఫీ చేయాలంటూ చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు పిలుస్తున్నారు. ఏడాదిలో 365 రోజులు ఉంటే అన్ని రోజులు బిజీగా ఉంటాడు ఈయన. అంత టాప్ లెవల్లో దూసుకుపోతున్నాడు శేఖర్. ఇలాంటి సమయంలో ఈయన ఇప్పుడు డాన్సులతో పాటు నటన వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. ఒకప్పుడు ప్రభుదేవా, లారెన్స్ ఎలా అయితే డాన్సులతో పాటు నటనలోనూ రప్ఫాడించారో.. ఇప్పుడు శేఖర్ కూడా ఇదే చేస్తున్నాడు. తాజాగా వినాయక చవితి కోసం ఈటీవీ చేస్తున్న ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారులో అదిరిపోయే స్కిట్ చేసాడు. జబర్దస్త్ కమెడియన్ ఛమ్మక్ చంద్రతో కలిసి ఈయన చేసిన స్కిట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రోమోతోనే నవ్వులు పూయించిన ఈయన.. ఇప్పుడు పూర్తి స్కిట్ తో కడుపులు చెక్కలు చేసాడు. అందులో భార్యకు భయపడే భర్తగా నవ్వులు పూయించాడు శేఖర్ మాస్టర్. పేరుకు కొరియోగ్రఫర్ అయినా కూడా ఈయన నటన చూసిన తర్వాత నవ్వు ఆపుకోవడం కాస్త కష్టమే. అంతగా బాగా కామెడీ చేసాడు ఈయన. ఇదే జోరు కొనసాగిస్తే హీరోగా కూడా బిజీ అయిపోతాడేమో..? మొత్తానికి కొరియోగ్రఫర్‌గా మొదలుపెట్టి స్టార్ గా మారే క్రమంలో ఉన్నాడు శేఖర్ మాస్టర్.

More Related Stories