నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్..Sivaji Raja
2020-05-05 23:30:53

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య వరసగా విషాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మరిచిపోకముందే ఇప్పుడు మరో వార్త వచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఉన్నట్లుండి ఈయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుఠాహుఠిన ఈయన్ని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే ప్రస్తుతం ఈయనకు చికిత్స కొనసాగుతుంది. శివాజీ రాజా పరిస్థితి పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతేడాది మా అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు ఈయన. హాయిగా సొంతూళ్లోనే ఉంటూ తన పనులు చేసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా కొన్ని రోజులుగా ఫామ్‌హౌజ్‌లో కూరగాయలు పండిస్తూ సినిమా కార్మికులకు ఉచితంగా పంచి పెడుతున్నాడు. అయితే ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న శివాజీ రాజా వందల సినిమాలు చేసాడు.. అమృతం సీరియల్‌తో నవ్వించాడు కూడా. తనకు త్వరగా నయం కావాలని కోరుకుంటుంది తెలుగు ఇండస్ట్రీ.

More Related Stories