విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..Chiranjeevi
2020-05-07 12:33:45

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన ప్రస్తుతం మొత్తం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నపిల్లలతో పాటు మూగజీవులు కూడా ఈ విషాద ఘటన లో చనిపోవడం అందరిని కలిచి వస్తుంది. విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టరైన్ గ్యాస్ లీకైన ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహా చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా'నని చిరు ట్విట్ చేశారు. ఏదైనా కూడా ఈ ఘటన జరగకుండా ఉంటే బాగుండేది అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు.
 

More Related Stories