అసురన్ బాలీవుడ్ కి...హీరో ఆయనేనాshah
2019-10-31 04:53:27

ఈ మధ్య కాలంలో తమిళంలో విడుదలై  రూ. 100కోట్ల వసూళ్లను రాబట్టిన సినిమా అసురన్. వెట్రిమారన్ డైరెక్షన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ధనుష్ ఊర మాస్ లుక్ లో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఈ చిత్రం. ధనుష్ హీరోగా మంజు వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ సిన్మా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ కానుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ లో నటించనున్నాడు. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన కలై పులి ఎస్ తాను తో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్ ను నిర్మించనున్నాడు. ప్రస్తుతం నటీనటులు , టెక్నీషియన్లను ఫైనల్ లో చేసే పనిలో ఉన్నారు తెలుగు టీమ్. అయితే ఈ మధ్య సౌత్ నుండి వస్తున్న సినిమాలని తెగ డౌన్ లోడ్ చేసుకుంటున్న బాలీవుద్ ఈ సినిమా మీద కూడా కన్నేసినట్టు సమాచారం.

ఇక తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ రీమేక్ చేయాలనీ భావిస్తున్నాడని బీ టౌన్ వర్గాల సమాచారం. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ కూడా వేయించుకుని చూశాడట షారుక్. అతనికి ఈ  సినిమా బాగా నచ్చడంతో  కొన్ని  మార్పులు చేసి హిందీలో రీమేక్ చేయాలనే యోచనలో ఉన్నాడని అంటున్నారు. త్వరలో ఈ విషయం మీద క్లారిటీ రావచ్చని అంటున్నారు.

More Related Stories