వాలెంటైన్స్ డే నాడు ఆ సినిమాsharwa
2019-11-06 16:12:27

శర్వానంద్, సమంత జంటగా  ఓ సినిమా తెరకెక్కుతోంది. తమిళ చిత్రం 96 రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన '96' సినిమా సుపర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు. అయితే ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర అంశం బయటికొచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నారట

. స్కూల్ లవ్ నేపధ్యంలో నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రేమికుల రోజునే తీసుకొస్తే మంచిదని భావిస్తున్నారట. ఈ అంశంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. సినిమాకు సంబంధించి... ఇప్పటికే విడుదలైన సమంత లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ మాతృకను తెరకెక్కించిన ప్రేమ్కుమార్ తెలుగులో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేశారు. త్రిష పోషించిన జాను పాత్రలో సమంత కనిపిస్తున్నది. సినిమా చిత్రీకరణ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. 

More Related Stories