వ్యాపారవేత్తతో శర్వానంద్ ప్రేమాయణం...పెళ్లి కూడా Sharwanand
2020-08-19 12:51:12

అదేంటో కానీ మామూలు రోజుల్లో కంటే ఈ లాక్‌డౌన్ టైంలోనే టాలీవుడ్ లో ఎక్కువ పెళ్ళిళ్ళు అయ్యాయి. అసలు ఊహించను కూడా ఊహించకుండా లాక్ డౌన్ లో తన ప్రేయసి యస్ చెప్పిందని చెప్పి షాక్ ఇచ్చాడు రానా. ఈయన కాక నితిన్, నిఖిల్ వంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. దీంతో మిగిలిన బ్యాచిలర్ హీరోల మీద ద్రుష్టి పెడుతున్నారు జనాలు. ఇప్పుడు మరో హీరో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈయన ఇప్పటికే ఒక అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడని అంటున్నారు. 

ఆమెతోనే వచ్చే నెలలో అతని నిశ్చితార్థం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆమె అతనికి చిన్ననాటి క్లాస్మేట్ అని అంటున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దలు చర్చలు కూడా జరిపారని అంటున్నారు. ఇప్పటికే ఆమె ఒక వ్యాపారం చేస్తోందట. వచ్చే నెలలోనే వీరి వివాహం జరిగిపోనుందని అంటున్నారు. అలానే ఈ నెలలో నిశ్చితార్ధం చేయాలని ఇరు కుటుంబాల పేదలు భావిస్తున్నారట. చూడాలి మరి ఈ వార్తలు ఎంతవరకూ నిజం అవుతయనేది. 

More Related Stories