నాగచైతన్య హీరోయిన్ తో శర్వానంద్ రొమాన్స్sharwanand
2020-07-21 09:38:19

‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి హిట్‌తో తెలుగు చిత్రసీమ దృష్టిని ఆకర్షించాడు వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి. అంత హిట్ కొట్టినా రెండో సినిమాని పట్టాలెక్కించడానికి మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాడు. ఆయన ‘మహా సముద్రం’ పేరుతో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. ఈ కథ అనేక మంది హీరోల చుట్టూ తిరగ్గా చివరికి రవితేజ దగ్గరికి వెళ్ళిందని, ఆయన ముందు ఒప్పుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ఒక ప్రచారం. దీంతో ఇదే కథను విశ్వక్‌ సేన్‌ - కార్తికేయలతో కలిసి చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అలా రవితేజ మొదలు నాగచైతన్య దాకా అనేక మంది హీరోల చేతులు మారిన కధ శర్వానంద్‌ వద్దకు చేరి ఓకె అయింది. ఈ సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరో పాత్రలో ఆర్‌ఎక్స్‌ 100 కార్తికేయ నటించవచ్చని అంటున్నా దాని మీద క్లారిటీ లేదు. 

అయితే శర్వా జోడీగా సమంతను అనుకున్నా ఆమె చేయనని చెప్పడంతో ఆ పాత్రకు సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. అయితే శర్వాతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా ముందే కమిట్ అయ్యి ఉన్న ప్రాజెక్ట్ కారణంగా చేయలేనని చెప్పిందట. దాంతో ‘మజిలీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దివ్యాంశ కౌశిక్ ను అజయ్ సంప్రదించాడని అంటున్నారు. అయిత్జే మజిలీ హిట్ అయినా కూడా ఆ చిత్రంలో దివ్యాంశ పోషించిన పాత్ర చిన్న పాత్ర అవ్వడం వల్ల ఆమెకు గుర్తింపు రాలేదు. దీంతో ఇప్పుడు దివ్యాంశ కౌశిక్ కు మహాసముద్రంలో ఛాన్స్ రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఎకె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని కరోనా సద్దుమణిగాక జూన్ లో ప్రారంభించవచ్చని అంటున్నారు. 

More Related Stories