ఉపాసన కోసం డాక్టర్ గా శర్వానంద్



Sharwanand
2021-06-03 12:10:04

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఉపాసన సినిమాలు చేయకపోయినా సామాజిక కార్యక్రమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ప్రముఖ ఆస్పత్రి బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు యూఆర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ ను ప్రారంభించి సెలెబ్రెటీలతో కలిసి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి...ఫిట్నెస్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను షేర్ చేస్తున్నారు. 

ఇక తాజాగా ఉపాసన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో డాక్టర్లు చేస్తున్న కృషి పై కరోనా పై 24 గంటలు చేస్తున్న పోరాటం పై ఓ షార్ట్ ఫిల్మ్ ను తీయాలని నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా ఈ షార్ట్ ఫిల్మ్ లో రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్ డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారట. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెలుబడనున్నాయి. ఇదిలా ఉండగా శర్వానంద్ ఇటీవలే శ్రీకారం సినిమాతో రైతుల గొప్ప తనాన్ని చెప్పారు. ఇక ఇప్పుడు డాక్టర్ల గొప్ప తనాన్ని చెప్పేందుకు షార్ట్ ఫిల్మ్ తో రాబోతున్నారు.
 

More Related Stories