జాతిరత్నాలు సినిమాను బ్యాన్ చేయాలి..శివసేన డిమాండ్



Shiv Sena
2021-03-25 17:21:26

టాలెంటెడ్ యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి కొత్త హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా జాతిర‌త్నాలు. ఈ సినిమాకు మొద‌టి షోతోనే పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దాంతో సినిమా క‌లెక్స‌న్స్ ప‌రంగా కూడా దూసుకుపోతుంది. ఈ సినిమా ఫుల్ లెన్త్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కింది. ఎంతో మంది సినిమా చూసి చాలా రోజుల త‌ర‌వాత క‌డుపుబ్బా న‌వ్వుకున్నామ‌ని అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పై ఓ వివాదం మొద‌లైంది. శివ‌సేన నేత‌లు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ పోలీలుసుల‌ను ఆశ్ర‌యించారు. శివ‌సేన రాష్ట్ర‌కార్య‌ద‌ర్శి గంగాధర్ మ‌రియు పార్టీ కార్య‌క‌ర్త‌లు కాచీగూడ పోలీస్‌స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు రాంప్రసాద్‌ బిస్మిల్‌ ఉరికంబం ఎక్కే ముందు పాడిన సర్‌ ఫరోషికీ తమన్నా హబ్‌ హమారే దిల్‌ మీ హై..అనే క‌విత‌ను జాతి ర‌త్నాలు సీనిమాలో ఫరోషికీ తమన్నా..స‌మంతా...ర‌ష్మిక‌..అంటూ వెట‌కారంగా పాడార‌ని దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. సినిమా ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, న‌టులు, మరియు ఈ క‌విత‌ను రాసిన ర‌చ‌యిత పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని..అంతే కాకుండా సినిమాను బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ‌‌

More Related Stories