దొరసానికి అవకాశాల కొరత.. రాజశేఖర్ కూతురుని పట్టించుకోరా..Shivathmika Rajashekar
2020-02-20 22:46:55

హీరో రాజశేఖర్ కూతుళ్లు ఇద్దరూ ఇప్పుడు టాలీవుడ్ లో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే అందాల ఆరబోతకు కూడా తెర తీస్తున్నారు. ఇప్పటికే పెద్ద కూతురు శివానీ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఔరా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న కూతురు శివాత్మిక కూడా ఇదే చేస్తుంది. అక్క కంటే ముందే దొరసాని సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసానిలో చిన్న దొరసానిగా నటించింది ఈమె. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా శివాత్మిక నటనకు మంచి పేరు వచ్చింది. కాస్త ట్రై చేస్తే కచ్చితంగా టాలీవుడ్ లో ఈమెకు మంచిరోజులు వస్తాయని నమ్ముతున్నారు సన్నిహితులు కూడా. సినిమా చూసిన వాళ్లు కూడా అమ్మడి నటన చూసి ఆహా ఓహో అన్నారు. అయితే ఎంత మంది ప్రసాదించిన కూడా ఇప్పుడు శివాత్మిక ఊహించిన దారిలో వెళ్లడం లేదు. ఈమెకు అవకాశాల కొరత బాగా కనిపిస్తుంది. అందుకే అందాల ఆరబోతకు కూడా రెడీ అయిపోయింది శివాత్మిక రాజశేఖర్. అయినా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ ఒలకబోయకపోతే కష్టం. 

అందుకే ఇప్పుడు అందాల ముళ్లు విప్పేస్తుంది శివాత్మిక. పేరెంట్స్ స్టార్స్ అనేది కూడా పక్కనబెట్టి పూర్తిగా గ్లామర్ షోకు ఓపెన్ అయిపోయింది ఈ దొరసాని. ప్రస్తుతం చేతిలో అమ్మడికి రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి రంగమార్తాండ కాగా మరోటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా అని తెలుస్తుంది. మరి ఈ సినిమాలతో రాజశేఖర్ కూతురు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడుతుందా లేదా అనేది చూడాలి.

More Related Stories