దొరసాని స్పీడ్ మామూలుగా లేదుగా



Shivathmika
2021-07-01 12:09:00

డాక్టర్ జీవిత రాజశేఖర్ ల ముద్దుల కూతురు శివాత్మిక "దొరసాని" సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాలో చిన్న దొరసాని పాత్రలో ఆమె నటనకు సినీ జనం నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇంత మంచి నటనతో జనాలను ఆకట్టుకున్న ఈ హీరోయిన్ వరుసపెట్టి సినిమాలు చేస్తుందేమో అని అందరూ అనుకున్నారు కానీ కేవలం నటించడం ముఖ్యం కాదు అని మంచి పాత్రలో కనిపించడం ముఖ్యం అనుకున్న ఈ ముద్దుగుమ్మ ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే తెలుగులో 'రంగ మార్తాండ' అనే సినిమా లో కనిపించబోతుంది .

ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర జనాలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని తెలుస్తుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా పాగా వేయాలని ఈ ముద్దుగుమ్మ చూస్తుంది .దానికి నిదర్శనం గానే తమిళంలో ఇప్పటికే 'ఆనందం విలయాడుమ్ వీడు' అనే సినిమాలో లో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మా కరోనా వల్ల వాయిదా పడింది .మరికొంత కాలం లో ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ఖరారు చేసే అవకాశం ఉంది. దీనితో పాటే మరొక తమిళ సినిమాకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆర్ కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇలా తమిళ్ లో ఈ ముద్దుగుమ్మ అదృష్టాన్ని పరీక్షించు పోతుంది.

More Related Stories