అభిజిత్‌ బిగ్‌బాస్‌ సంపాదన చూస్తే షాక్ అవుతారు Bigg boss 4
2020-12-22 22:22:22

బిగ్‌బాస్‌ ముగిసినప్పటికీ ఈ షోకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విన్నర్‌గా నిలిచిన అభిజిత్‌ షో మొత్తం రెమ్యునరేషన్‌ విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా విజేతగా నిలిచిన అభిజిత్‌ బిగ్‌బాస్‌ షో కోసం వారానికి 4 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 106 రోజులకు 60 లక్షలు, ప్రైజ్‌ మనీ 25 లక్షలు కలిపి మొత్తం 85 లక్షలు అభికి మూటజెప్పినట్లు టాక్‌. వాస్తవానికి బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ కంటే హౌజ్‌లో ఉన్నందుకే అభి అధికంగా రెమ్యునరేషన్‌ అందుకున్నాడు. 

బిగ్‌బాస్‌లోకి వచ్చినప్పడు కూడా అభిజిత్‌పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. షో ఆరంభంలో అతడిపై ఎలాంటి అంచనాలూ లేవు. కానీ క్రమ క్రమంగా అభిజిత్‌ టాలెంట్‌ బయటపడింది. కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్‌ ఆడడం ప్రేక్షకులను ఆకర్షించింది. మాస్టర్ మైండ్‌తో అతడు తీసుకున్న నిర్ణయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒక్క నామినేషన్‌ టాస్కుల్లో తప్ప ఆయన ఎప్పుడూ ఎవరితో గొడవపడలేదు. కామ్‌గా ఉంటూ.. నామినేషన్‌ను కూడా సీరియస్‌గా తీసుకునేవాడు కాదు. క్లిష్ట సమయంలోనూ సహనాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ఓట్లను సంపాదించాడు. అభిజీత్‌ను హౌస్‌మేట్స్ అంతా కలిసి 11 సార్లు నామినేట్ చేశారు. నామినేషన్ జరిగిన 14 వారాల్లో 11 సార్లు నామినేట్ అవడం వల్ల ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు. ఇది కూడా అతడి విజయానికి కారణమైంది. గత రెండు సీజన్ల విన్నర్లు రాహుల్‌, కౌషల్‌ కూడా 11 సార్లు నామినేట్‌ కావడం గమనార్హం.

More Related Stories