అతను ఉండగా హౌస్ లోకి రానందటshraddha das
2019-09-05 09:13:31

బిగ్ బాస్ 3 రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం హెబ్బా పటేల్, శ్రద్దా దాస్, ఈషా రెబ్బా వంటి యంగ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే వీరిలో హేబ్బా, శ్రద్దాల మీద బిగ్ బాస్ యాజమాన్యం ఎక్కువ ఫోకస్ చేసిందట. ఎందుకంటే వీరిద్దరూ అయితే స్కిన్ షోకి అడ్డు చెప్పరని భావించారు. అయితే హెబ్బా కొన్ని రోజులు టైం అడిగిందట, దీంతో శ్రద్దా దాస్ ని లోపలికి పంపాలని బిగ్ బాస్ యాజమాన్యం భావించిందట. శ్రద్దా కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపినా తన మాజీ లవర్ అయిన వరుణ్ ఇంట్లో తాను లోపలికి వెళ్లనని తెగేసి చెప్పేసిందట.  వరుణ్ గనుక ఎలిమినేట్ అయితే వస్తానని చెప్పడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఒక వారం రోజులు ఆలస్యం చేశారట. కానీ వరుణ్ అసలు నామినేషన్స్ లోకే వెళ్లకపోవడంతో శ్రద్ధా ప్లేస్ లో ఫేడవుట్ అయిన యాంకర్ శిల్పాను లోపలికి పంపారట. 
.
వరుణ్ శ్రద్దాలు ఇద్దరూ మరో చరిత్ర అనే సినిమా చేసే సమయంలో ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఆ తర్వాత క్లోజ్ అయి ప్రేమకి దారి తీసింది. ఆ తర్వాత ఏవో విభేదాలు వచ్చి విడిపోయారు. అయితే తనకి వరుణ్ కి మధ్య చెడిందని శ్రద్దా ఒప్పుకున్నా వరుణ్ ఒప్పుకోలేక పోయాడు, అసలు తనకు ఆమెకు మధ్య ఏమీ లేదని చెప్పేవాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఇద్దరూ సినిమాలలో ఫేడవుట్ అయ్యారు. శ్రద్దా అడపాదడపా స్క్రీన్ మీద కనిపించినా వరుణ్ కి అవకాశాలు రాక పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు.  నిజానికి వరుణ్‌తో బ్రేకప్‌ అయిన తర్వాత శ్రద్ధ డిప్రెషన్‌కి గురయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. జరిగిందేదో జరిగిపోయినా ఇప్పుడు అతను భార్యతో కలిసి ఉన్న హౌస్‌లోకి వెళితే మళ్ళీ పాత విషయాలు ప్రస్తావనకి వస్తాయని అలా రావడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పినట్టు సమాచారం.

More Related Stories