అమ్మో..శ్రియ భర్త ఇలా అంటే...ఇక జనాలు ఆగుతారా ?shriya
2020-04-18 14:46:19

టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ ప్రస్తుతం తన ఫారెన్ భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంటోన్న సంగతి తెలిసిందే. కరోనా కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత సమయంలో కరోనా లక్షణాలు బయట పడడంతో టెస్టులు కూడా చేయించుకున్నాడు ఆండ్రీ. తన భర్తలో కరోనా లక్షణాలు కనిపించాయని అందుకే తాము విడివిడి గదుల్లో ఉంటున్నామని శ్రియ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఆండ్రీ పుట్టిన రోజు వేడుకలను ఇంట్లోనే జరుపుకున్నారు. ఈ క్రమంలో అభిమానులతో లైవ్ లో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే  ఓ నెటిజ‌న్ శ్రియకి అస‌భ్యంగా కామెంట్ పెట్టాడు. దీనిని త‌న భ‌ర్త ముందే గట్టిగా చ‌దివి వినిపించింది శ్రియ‌. అదేంటంటే  మీ వక్షోజాలు అందంగా ఉంటాయి కదా అంటూ...

అయితే మామూలుగా అయితే ఈ కామెంట్ విన్నాక కోపం వస్తుందని అనుకుంటాం కానీ అతను అలా కాకుండా తన భార్య శ్రియపై ఎక్కువ కామెంట్లు చేయాలంటూ భర్త ఆండ్రీ నెటిజన్లను కోరాడు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియ.. వీడియోలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా.. శ్రియ శరీరంపై ఓ నెటిజన్‌ కాస్త శృతిమించి మాట్లాడారు. దీన్ని శ్రియ పట్టించుకోలేదు.. కానీ ఆండ్రీ మాత్రం ఫన్నీగా తీసుకున్నారు. మీ మాటలతో నేను కూడా ఏకీభవిస్తున్నానన్నారు. ఆమెపై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయండి ప్లీజ్‌ అంటూ రిప్లై ఇచ్చారు.. భర్త అలా అనగానే పక్కనే ఉన్న శ్రియ.. అతడిని నవ్వుతూ కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అమ్మో..శ్రియ భర్త ఇలా అంటే...ఇక జనాలు ఆగుతారా ? అనే కామెంట్స్ కూడా జనాల నుండి వినిపిస్తున్నాయి.

 

More Related Stories