శ్రియా సరన్ కు తృటిలో తప్పిన ప్రమాదంshriya saran
2021-03-03 18:48:36

హాట్ బ్యూటీ శ్రియా సరన్  అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన నటిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉన్న శ్రియా సరన్  తన  భర్త ఆండ్రీ కోస్చీవ్ తో కలిసి హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈనేపథ్యంలో శ్రియా సరన్  కుఙ్గు లోని మచ్చు పిచ్చు ప్రాంతానికి వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. 

అయితే తాజాగా శ్రియా సరన్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మచ్చు పిచ్చు ప్రాంతంలో శ్రియా  ఫోటోలకు పోజులు ఇస్తూ ఉండగా అక్కడే ఉన్న ఒక ఒంటె ఒక్కసారిగా ఆమె పైకి దూసుకువెళ్లింది. దాంతో శ్రియా  భయపడి ఒక్కసారి లేచి పరిగెత్తింది. ఆ ఒంటగాని తాకి ఉంటే శ్రియాకు ఖచ్చితంగా గాయాలయ్యేవి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తతం శ్రియా జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ లో నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ కు హీరోయిన్ గా శ్రియా నటిస్తోంది.

More Related Stories