శృతిహాస‌న్ మనసు దోచుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..sru
2019-12-26 11:57:39

శృతిహాసన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది కానీ ప్రేక్షకులకు మాత్రం కాదు. తాజాగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేస్తుంది ఈమె. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది శృతి. దాంతో పాటే ఎప్పటికప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఈ మధ్యే ఓ ఈవెంట్ కు వచ్చిన ఈ హీరోయిన్.. అక్కడ విధ్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. మీ కెరీర్లో ఇప్పటివరకు మీకు ఇష్టమైన సినిమా ఏది అంటే మరో ఆలోచన లేకుండా తన తండ్రి కమల్ హాసన్ నటించిన మహానది పేరు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన సినిమా ఏది అంటే మహానది పేరు చెప్పింది.

తన కెరీర్లో చాలా ప్రభావం చూపించిన సినిమా ఇది అని గుర్తు చేసుకుంది శృతిహాసన్. ఇందులో తన తండ్రి కమల్ హాసన్ నటన జాతీయ స్థాయిలో ఉంటుందని.. అది ఎప్పటికీ మర్చిపోలేన‌ని.. ఆయన ఉత్తమ నటుడు అంటూ ప్రశంసించింది ఈ భామ‌. ఇక మీకు ఇష్టమైంది.. మీ కెరీర్లో ఏం సాధించాలి అనుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు నటనతో పాటు సింగింగ్ కూడా ఇష్టమని.. మ్యూజిక్ ప్రాణం అని చెప్పింది శృతిహాసన్. అయితే ఏం చేసినా కూడా ప్రేక్షకులను అలరించడం కోసమే చేశాన‌ని.. ఏదైనా తనకు ఒక్కటే అని ఆన్సర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తమిళ హీరో అజిత్ గురించి చెప్పండి అంటే ఆయన ఒక సాంప్రదాయబద్ధమైన హీరో అని.. ఆయన లాంటి మనిషిని నేను ఎప్పుడూ కలవలేదు అంటూ అజిత్ ను మునగచెట్టు ఎక్కించింది శృతి. గతంలో ఇద్దరు కలిసి శివ తెరకెక్కించిన వేదళం సినిమాలో నటించారు. మొత్తానికి తన రీ ఎంట్రీ భారీగా ప్లాన్ చేసుకుంటున్న శృతిహాసన్ మరి రవితేజ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలిక.

More Related Stories