పెళ్లై ఏడాది కూడా కాకుండానే విడాకులు తీసుకున్న హీరోయిన్ !swethabasu
2019-12-10 18:15:27

సినిమా ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత అనూహ్య పరిస్థితుల్లో జ‌రుగుతున్నాయో విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. తాజాగా గా తెలుగు హీరో మంచు మనోజ్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలికి చర్చకు తెరలేపగా ఈ లిస్టులో తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ చేరింది. తెలుగులో ‘కొత్త బంగారులోకం’ సినిమాతో పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ ఆమె చేసిన సినిమాల కంటే పోలీస్ రైడింగ్ కేసుతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఈమె/. ఆ కేసు తర్వాత తెలుగు సినిమాలకి దూరం అయిపొయింది. అయితే ఆమె వ్యాపారవేత్త అయిన రోహిత్ మిట్టల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరు గతేడాది డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. తొలి పెళ్లి రోజు జరుపుకోవడానికి సరిగ్గా మూడు రోజులు ఉందనగా వీరు విడిపోయినట్టు శ్వేత ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆమె చేసిన ప్రకటనా ప్రకారం ‘హాయ్, రోహిత్ నేను పరస్పరం మాట్లాడుకుని విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా ఇద్దరం సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్నాం. కానీ పరిష్కారం అవ్వలేదు. పుస్తకంలోని ప్రతీ పేజీని చదవకపోయినంత మాత్రాన ఆ పుస్తకం చెడ్డదని కాదు. కొందరు చదవలేక కొన్ని విషయాలను తెలుసుకోకుండా మిగిలిపోవచ్చు. చెరిగిపోని జ్ఞాపకాలను మిగిల్చినందుకు, నాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు రోహిత్. నీ జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటూ నీ చీర్‌లీడర్’ అని పేర్కొన్నారు. ఇంత చెప్పుకొచ్చిన శ్వేతా భర్తతో విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. 

More Related Stories