తెలుగు వదిలాక సిద్ధార్థకు కలిసొచ్చిందా..?Siddharth-01
2018-07-03 19:26:28

సిద్ధార్థ్.. ఈ పేరు చెప్పగానే బొమ్మరిల్లు గుర్తొస్తుంది. అంతలా తన ముద్రను టాలీవుడ్ పై వేశాడు సిద్ధార్థ్. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాలతో కంప్లీట్ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధూ తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ హిట్లు సాధించలేకపోయాడు. కానీ మనోడు కాస్త తలపొగరుగా మాట్లాడతాడు అనే పేరు మాత్రం తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం మీడియాపై కూడా నోరు పారేసుకున్న సిద్ధార్థ్ ను ఆల్మోస్ట్ టాలీవుడ్ మీడియా బాయ్ కాట్ చేసినంత పనిచేసింది. అయినా మనోడు ఏ మాత్రం తగ్గలేదు. ఇదే సమయంలో వరుసగా వస్తోన్న ఫ్లాపులు కూడా తోడై ఏకంగా టాలీవుడ్ నుంచి అతనికి ఎగ్జిట్ కార్డ్ పడేలా చేశాయి. అయితే టాలీవుడ్ వదిలినా.. అతనికి బానే కలిసొచ్చినట్టుంది. టాలీవుడ్ ను వదిలేసిన తర్వాత మాతృభాష కోలీవుడ్ కు వెళ్లాడు సిద్ధార్థ్. అక్కడ ఇక్కడున్నంత క్రేజ్ లేకపోయినా మెల్లగా కంటెంట్ బేస్డ్ సినిమాలతో మెల్లగా పికప్ అయ్యాడు. కొంత వరకూ ఫర్వాలేదనిపించే స్థాయికి ఎదిగాడు.

ఇక లాస్ట్ ఇయర్ చేసిన గృహం సినిమా అతనికి తమిళ్ తో పాటు తెలుగులోనూ పెద్ద విజయాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ యేడాది ఓ మళయాల సినిమా కూడా చేశాడు. దిలీప్ హీరోగా నటించిన ఈ సినిమా అతనికి ఫస్ట్ మాలీవుడ్ మూవీ. కాస్త విలనీ టచ్ ఉండే ఈ పాత్ర అతనికి మాలీవుడ్ లో మంచి పేరే తెచ్చింది. అటు కన్నడలో కూడా ఓ సినిమా చేసి ఉన్నాడు. దీంతో ఇప్పుడు ఏ సినిమా చేసినా ఈ నాలుగు భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా మరో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాకు కమిట్ అయ్యాడు సిద్ధార్థ్. కేథరీన్ థ్రెస్సా హీరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీని తమిళ్ తో పాటు తెలుగు, మళయాల, కన్నడ భాషల్లో విడుదల చేసేలా పావులు కదుపుతున్నారు.  నిజానికి సిద్ధార్థ్ తెలుగులో చేసినప్పుడు అతని మార్కెట్ ఇక్కడికే పరిమితం. కానీ టాలీవుడ్ ను వదిలిన తర్వాత అన్ని ఉడ్స్ లోనూ అడుగుపెడుతూ అన్ని చోట్లా సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం పరిస్థితిని బట్టి సిద్ధార్థ్ కు తెలుగులో వచ్చినంత క్రేజ్ కానీ, మార్కెట్ కానీ మరే భాషలో రాదనేది క్లియర్. బట్ ఉన్నన్నాళ్లూ ఉనికిని కాస్త గట్టిగా చాటుకోవడానికి, ఏ భాషలో సినిమా చేసినా ఈ మల్టీ లాంగ్వేజెస్ లోని మార్కెట్ యూజ్ అవుతుంది. 

More Related Stories